తెలుగు సెక్సు కథలు 6

అన్నమయ్య ప్రారంభించిన పదకవిత్వం తెలుగు సాహిత్యంలో నూతన కవితా సంప్రదాయాన్ని ఆవిష్కరించింది. ఆయన రచించినట్లుగా చెప్పుకునే 32 వేల సంకీర్తనల్లో దాదాపు 14.5 వేల సంకీర్తనలే లభ్యమయినా, అవి అనంతమైన వైవిధ్యానికి, నూతన భావ ప్రకటనకు వీలు కల్పించిన రచనలు. ఆయన రచనల పట్ల ఎంత ఆకర్షణ ఉందో, అన్నమయ్య వ్యక్తిగత జీవితమూ అంతటి ఆసక్తిదాయకం. అన్నమయ్య కవిత్వంతో పెనవేసుకొనిపోయిన ఆయన జీవితాన్ని నేటికీ తెలుగులో అనేకమంది పరిశోధకులు వివరించి ఉన్నారు. ఆ సంప్రదాయంలో వినూత్నంగా, విశిష్టంగా ఆవిష్కృతమైన గ్రంథం – ‘God on the Hill’ . అన్నమయ్య రచనల్లో ఆయన కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే నూరు ప్రాతినిధ్య కవితలను ఆంగ్లంలోకి అనువదించారు – విఖ్యాత పరిశోధక, అనువాదకులు వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్ గారులు. తెలుగు సాహిత్యంతో గాఢమైన అనుబంధం మాత్రమేగాక, సొగసైన ఆంగ్లంలో పెట్టగలిగిన కవితా హృదయులు గావడం వల్ల అన్నమయ్య పాదాలకు ఎంతటి లాలిత్యమూ, సౌకుమార్యమూ ఉన్నాయో, ఆంగ్లంలోనూ అంతటి మార్దవం సమకూర్చారీ అనువాదకులు.
అన్నమయ్యను ఆంగ్లంలో పరిచయం చేసినవారిలో అడపా రామకృష్ణ రావు గారి కృషి శ్లాఘనీయం. వారు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ కోసమై రాసిన పుస్తకంలో అన్నమయ్యను అత్యంత సమర్థవంతంగా ప్రదర్శించి ఉన్నారు. కానీ, ఆ పుస్తకం పరిధి చిన్నది కావడం వల్ల పరిమితులున్నాయి. ప్రస్తుతానువాద గ్రంథం విస్తృతమైనదేగాక, కవితానువాదాన్ని గ్రహించి తర్వాత ఆ కవి రచన ఏ కాలం నాటిదో, ఏ సందర్భంలో కావ్యం వెలువడిందో వివరించే విపుల పరిశోధనాత్మక వ్యాసం సమకూర్చడం ఈ అనువాదక పరిశోధకులు నిర్వహించిన ప్రత్యేక కృషి.
అన్నమాచార్య జీవితాన్ని అధ్యయనం చేయడానికి గొప్ప ఆకర గ్రంథం – ఆయన మనవడే ( తాళ్ళపాక చిన్నన్న/ తిరువేంగళనాథుడు ) రచించిన ‘అన్నమాచార్య జీవిత చరిత్రము’. అది చిన్న ద్విపద కావ్యమే అయినా వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ఎంతో విపులమైన పీఠిక సమకూర్చి అన్నమాచార్య జీవితానికి, కవిత్వానికి ఉన్న సంబంధాన్ని అతి సమర్థంగా స్థాపించారు. నేటికీ ప్రభాకర శాస్త్రి గారి పీఠిక మౌలిక విషయాలను గ్రహించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంది. అన్నమాచార్య సాహిత్యాన్ని లోకానికి పరిచయం చేయడంలో వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు చూపిన వైదుష్యం లోకమంతా గౌరవించింది. ఈ అనువాదక, పరిశోధక గ్రంథంలోనూ వారి కృషిని స్మరించడం అనువాదకుల విజ్ఞతకు నిదర్శనం.
అన్నమయ్య విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసరించినవాడు. ఆ సిద్ధాంతం ద్వైధీభూతమెలాగో ఆయన కవిత్వమూ ద్విధావిభజితం. భగవత్కీర్తనకై పరమ ఆధ్యాత్మిక సంకీర్తనలు ఎలా రచించాడో, వెంకటేశ్వరుడు ఆయన ఇరువురు భార్యలు – అలమేలు మంగ , పద్మావతుల శృంగారాన్ని రసరమ్యంగా కీర్తించాడు. భక్తుడైన వ్యక్తి ఆ శృంగార సంకీర్తనలను నాయక, నాయికలు అలౌకికులని భావిస్తే అవి భగవదారాధనలో భాగమవుతాయి. ఆ శృంగార సంకీర్తనలు భగవంతునికి సంబంధించినవని భక్తుడు నిరంతరం భావిస్తూ ఉండాలి. భక్తుడు/ శ్రోత/ పాఠకుడు ఆ పాత్రల్లో తాదాత్మ్యమవడానికి వీలు లేదు. అప్పుడవి పరమలౌకిక శృంగార గీతాలయ్యే ప్రమాదముంది. అన్నమాచార్యుడిని తన ఆస్థానానికి ఆహ్వానించి వేంకటేశ్వరుడి పై పాట పాడుమన్న సాళువ నరసింహరాయుడు ‘ఏమొకో చిగురుట ధరమున’ అనే రమ్యమైన గీతాన్ని విని, తనపైగూడా అటువంటి కీర్తనే పాడుమని అనడం, నరసింహరాయుడు ఆ పాత్రలో తాదాత్మ్యమవడం వల్లే జరిగింది. ‘నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపదు జిహ్వ’ అని అన్నమయ్య సున్నితంగా తిరస్కరించాడు. ఆ సందిగ్ధావస్థలోని సంక్లిష్ట స్థితిని ఈ పరిశోధకులు అతి సున్నితంగా విశదీకరించారు – తమ After word లో.
అన్నమాచార్య సంకీర్తనలను, వాటి అనువాదాలను ఈ క్రింద పొందుపరచదలిచాను. మానవుని ఏకాగ్రతా స్వరూపమే దైవమని వర్ణించడానికి అన్నమయ్య మంచి సంకీర్తన కూర్చారు -ఆయన,